శామీర్ పేట, వెలుగు: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ లక్ష్మాపూర్ పరిధిలోని శ్రీరాములగుట్ట బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. వేద పండితులు నాగరాజు, సందీప్ శర్మ, ఆదిత్య శర్మ మంత్రోచ్చారణల మధ్య సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం లగిశెట్టి మాధవి రాంప్రసాద్ దంపతుల సహకారంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
